ఏప్రిల్ 20వ తేదీన ఈ కేసుకు సంబంధించి విచారణ జరగబోతోంది. మరొకవైపు విజయ్ ఇంట్లో తన విడాకుల వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. దాదాపుగా ఐదు సంవత్సరాలుగా తాను నరకం అనుభవిస్తున్నాను అంటూ విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్లో దాఖలు వేసింది.ఇదంతా ఇలా ఉండగా విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ తన తండ్రికి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే సోషల్ మీడియాలో విజయ్ ను అన్ఫాలో చేశారు.
సాధారణంగా తండ్రి ఇంటి పేరులోని మొదటి అక్షరాన్ని ఇనిషియల్ గా ఉపయోగించుకోవడం ఆనవాయితీ ఇప్పుడు జాసన్ సంజయ్ మాత్రం తన ఇన్సెల్లి మార్చుకున్నట్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. తండ్రి విజయ్ పేరుతో వచ్చే వి అక్షరాన్ని తొలగించుకొని తన తల్లి పేరుతో వచ్చే ఎస్ అక్షరాన్ని చేర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హీరో గానే కాకుండా జాసన్ సంజయ్ డైరెక్టర్ గా కూడా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్నారు. సిగ్మా అనే చిత్రంతో డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా టైటిల్ కార్డులో తన తండ్రి పేరుకు సంబంధించిన ఇనిషియల్ కాకుండా తన తల్లి పేరుతో వచ్చే ఇనిషియల్ ని టైటిల్ కార్డులో చూపించబోతున్నారని తెలిసి ఇది పెద్ద చర్చకు దారితీసింది. దీన్నిబట్టి చూస్తే విజయ్ తనయుడు కూడా విజయ్ కి దూరం అవుతున్నారనే సందేహాలు అభిమానులలో వ్యక్తం అవుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి