రాశి ఖన్నా కెరీర్‌లో మలుపు తిప్పే సినిమాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నిలవబోతోంది.పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఈ భారీ చిత్రంలో రాశి ఖన్నా ఒక కీలక పాత్ర పోషించింది. శ్రీలీల మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ, రాశి పాత్రకు మంచి వెయిట్ ఉందని టాక్.మార్చి 19న ఈ సినిమా హిట్ అయితే రాశికి మళ్ళీ గోల్డెన్ డేస్ మొదలైనట్టే. పవర్ స్టార్ సినిమాతో వచ్చే క్రేజ్ మామూలుగా ఉండదు కాబట్టి, ఈ మెగా ఛాన్స్‌ను రాశి గట్టిగానే నమ్ముకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు రాశి ఖన్నా ఇప్పుడు ఒక భారీ ‘పాన్ ఇండియా’ స్కెచ్ వేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ సెన్సేషన్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో ఒక సినిమా పట్టాలెక్కబోతున్న సంగతి తెలిసిందే.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రాశి ఖన్నా ఇటీవలే దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ను కలిసిందట. ఈ భారీ యాక్షన్ డ్రామాలో ఒక పవర్ ఫుల్ రోల్ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తోందని వినికిడి.
మైత్రీ మూవీ మేకర్స్ ‘పుష్ప 2’ తర్వాత బన్నీ రేంజ్ ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్ళింది. అలాంటి సినిమాలో ఒక్క ఛాన్స్ దక్కినా రాశి ఖన్నా ఫేట్ మారిపోయినట్టే. లోకేష్ మార్క్ సినిమాలో లేడీ క్యారెక్టర్లు కూడా చాలా షార్ప్‌గా ఉంటాయి, అందుకే రాశి ఈ ప్రాజెక్ట్ కోసం గట్టిగా ట్రై చేస్తోంది.రాశి ఖన్నా సైలెంట్‌గా తన కెరీర్ బిగ్గెస్ట్ మూవ్స్ వేస్తోంది. ఒకవేళ బన్నీ - లోకేష్ సినిమాలో ఆమె సైన్ చేస్తే, టాలీవుడ్ టాప్ హీరోయిన్ల రేసులో ఆమె ముందు వరుసలోకి రావడం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి