మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లయ్యాక నటిస్తున్న సినిమా సతీ లీలావతి..ఈ సినిమా లో దేవ్ మోహన్ హీరోగా.. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా..నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఈ నెలలో సినిమా విడుదల అవ్వాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించిన కొత్త డేట్  ని మేకర్స్ అనౌన్స్ చేయబోతున్నారు.అయితే ఈ విషయం పక్కన పెడితే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తన జీవితంలో ఉన్న చీకటి రోజుల గురించి బయట పెట్టింది.

 లావణ్య త్రిపాటి మాట్లాడుతూ.. గతంలో నేను ఓ తమిళ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి ఒప్పుకున్నాను.కానీ ఆ సినిమా షూటింగ్ కి వెళ్ళిన సమయంలో డైరెక్టర్ నుండి నాకు చేదు అనుభవం ఎదురయింది. ఆయన ప్రవర్తన నచ్చక నాకు షూటింగ్ సెట్లో రక్షణ లేదు అనిపించి ఆ సినిమా నుండి తప్పుకున్నాను.అయితే ఎప్పుడైతే ఆ సినిమా నుండి తప్పుకున్నానో ఆ తర్వాత నుండి డైరెక్టర్ నిర్మాత ఇద్దరు కలిసి నాపై దుష్ప్రచారం చేయించారు. కావాలనే డబ్బులు ఇచ్చి మరీ పేపర్లలో తప్పుడు రాతలు రాయించారు. అంతే కాదు నా మీద కేసులు కూడా పెట్టారు.

కానీ ఆ క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఎవరు కూడా సపోర్టుగా నిలవలేదు.. ఎవరూ నాకు మద్దతుగా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక చాలా బాధపడ్డాను. ఇదంతా కరోనా సమయంలో జరిగింది. కరోనా టైంలో ఆ తమిళ సినిమా నుండి అసౌకర్యంగా ఉండడంతో చాలా ధైర్యంగా ప్రాజెక్టు నుండి తప్పుకున్నాను. దాంతో ఆ సినిమా దర్శకుడు నిర్మాత నాపై కక్ష్య కట్టారు అంటూ లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది.అయితే లావణ్య త్రిపాఠి మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ లావణ్య త్రిపాఠిని లైంగికంగా వేధించిన ఆ తమిళ దర్శకుడు ఎవరబ్బా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: