పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరి శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సందర్భంగా ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు మేకర్స్. అక్కడికి చిత్ర బృందంతో పాటు , హీరోయిన్స్ కూడా హాజరయ్యారు. అయితే ఈ క్రమంలోనే ఈవెంట్లో హీరోయిన్ శ్రీలీల, నటుడు మహేష్ వైపు సీరియస్ గా చూస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పైన చాలా రకాలు గానే కామెంట్స్ వినిపిస్తున్నాయి.



ముఖ్యంగా కొంతమంది శ్రీలీల , జబర్ధస్త్ మహేష్ కి వార్నింగ్ ఇచ్చిందంటూ కామెంట్స్ చేయగా ,మరి కొంతమంది మహేష్ ఏదో చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో పైన మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ వీడియోలో  శ్రీలీల వెనక్కి చూసిన క్రమంలో తనను చూస్తోందనుకొని మహేష్ ఆమె వైపు చూసి నవ్వుతారు. కానీ మహేష్ ను మాత్రం  పట్టించుకోకుండా సీరియస్గా చూస్తూ శ్రీలిల ముందుకి తిరుగుతుంది. ఈ వీడియో వైరల్ గా మారడంతో మహేష్ ను, శ్రీలీల అవమానించింది అంటూ సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ మొదలయ్యాయి.


ఈ విషయం పైన మహేష్ క్లారిటీ ఇస్తూ.. శ్రీలీల(ఆమే) మొబైల్ పట్టుకోమని తనకు ఇచ్చారని ఆ తర్వాత ఆవిడ వెనక్కి చూస్తే నా వైపు ఫోన్ కోసం చూస్తున్నారనుకున్నాను కానీ శ్రీలీల పైకి స్క్రీన్ వైపు చూస్తున్నారు. అక్కడ జరిగింది అంతే ఇక్కడ ఎవరు ఎవరిని అగౌరపరచలేదంటూ జబర్దస్త్ మహేష్ తెలియజేశారు. ఎట్టకేలకు నిన్నటి రోజు నుంచి వైరల్ గా మారిన ఈ వీడియోకి క్లారిటీ ఇవ్వడంతో శ్రీలీల అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది శ్రీ లీల.

మరింత సమాచారం తెలుసుకోండి: