పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తున్నారంటే కచ్చితంగా అందులో త్రివిక్రమ్ హ్యాండ్ ఉండాల్సిందే. ఎందుకంటే వీరుద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. అయితే ఇప్పుడు అది పెద్దగా కనిపించడం లేదనే విధంగా సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. జల్సా సినిమా నుంచి మొదలైన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సన్నిహిత్యం ఆ తర్వాత అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి చిత్రాలు చేసేలా చేశాయి. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ పొలిటికల్పరంగా బిజీగా ఉన్నారో అప్పటినుంచి త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి అన్ని వ్యవహారాలు కూడా దగ్గరుండి మరి చూసుకునేవారు.


అలా భీమ్లా నాయక్, బ్రో చిత్రాలతో  పాటు మరికొన్ని సినిమాలలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది. ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు, ఓజి వంటి చిత్రాలకు త్రివిక్రమ్ పేరు ఎక్కడ వినిపించలేదు. అందుకు కారణం వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని అందుకే త్రివిక్రమ్ దూరంగా ఉంటున్నారనే విధంగా వినిపిస్తున్నాయి.. కానీ మరోపక్క మాత్రం  త్రివిక్రమ్ కొత్త సినిమాలే  పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 2020 నుంచి పెద్దగా సినిమాలు చేయని త్రివిక్రమ్.. చివరిగా గుంటూరు కారం సినిమాని దర్శకత్వం వహించారు.


ఇక తర్వాత దర్శకత్వం పైన ప్రత్యేకించి ఫోకస్ పెట్టాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లు వినిపిస్తున్నాయి .అందుకే పవన్ సినిమాలలో ఇన్వాల్వ్ కావడం లేదని, ఎలాంటి ఫంక్షన్స్ కి కూడా వెళ్లలేదనే విధంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో కలిసి ఆదర్శకుటుంబం అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ తో ఒక మైథాలజికల్ సినిమా చేయబోతున్నారు త్రివిక్రమ్. మరి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మధ్య నిజంగానే విభేదాలు ఉన్నాయా లేవా అనే విషయంపై ఎవరు క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: