ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో ఇప్పటికే రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు ఫైనల్ అయిందని టాక్ నడుస్తోంది. బన్నీ స్టైలిష్ లుక్ పక్కన శ్రద్ధా జోడి అదిరిపోతుందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, స్టార్ నటి అనుష్క శర్మ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ఒక కీలక పాత్రలో నటించే అవకాశం ఉందట. ఒకవేళ ఇదే నిజమైతే, ఇండియన్ స్క్రీన్ మీద ఇది బిగ్గెస్ట్ క్రేజీ కాంబినేషన్ అవుతుందనడంలో డౌట్ లేదు!
లోకేష్ కనగరాజ్ సినిమా అంటేనే అందులో ఒక వైల్డ్ ఎనర్జీ ఉంటుంది. దానికి తోడు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ తోడైతే థియేటర్లలో సౌండ్ బాక్సులు పేలిపోవాల్సిందే!లోకేష్ తన ‘లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్’ (LCU) లో భాగంగా ‘ఖైదీ 2’ చేయాల్సి ఉన్నా, బన్నీ కోసం ఆ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారు. హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్‌ను కలవడంతో ఈ ఏడాది సెకండాఫ్ లోనే షూటింగ్ షురూ కానుందని క్లారిటీ వచ్చేసింది.ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో వర్క్ చేస్తున్న బన్నీ, ఆ తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని లోకేష్ ప్రాజెక్ట్ సెట్స్‌లోకిఅడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని, ఇదొక ఊరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అని సమాచారం.
ఏదేమైనా అనుష్క శర్మ.. అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ మూవీలో నటిస్తుందా లేదా అన్నదానిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం వినిపిస్తున్నది అంతా గుసగుసలే కావడంతో, అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఆ కాంబినేషన్ నిజమైతే, ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి