ప్రముఖ నటిగా పేరు సంపాదించిన పునర్నవి భూపాలం తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉయ్యాల జంపాల సినిమాతో నటిగా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది. తెలుగు బిగ్ బాస్ షోలో కూడా అడుగుపెట్టి మరింత క్రేజ్ అందుకుంది. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న పునర్నవి తాజాగా తన ప్రియుడుతో కలిసి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.


పునర్నవి భూపాలం తన అందం అభినయంతో పల్లెటూరి అమ్మాయిగా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన ఆశించిన స్థాయిలో  ఫేమ్ అందుకోలేకపోయింది.అందుకే ఎక్కువగా ఈమెకు నటిగానే ఎక్కువగా అవకాశాలు లభించాయి. అయితే తనకు వచ్చిన కొన్ని ఆఫర్స్ ని వదులుకొని మరి పై చదువుల కోసం లండన్ కి వెళ్లి మరి అక్కడ చదువుకుంది. దీంతో సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్టులను షేర్ చేస్తూ ఉంటుంది.


అలా గత ఏడాది తాను ప్రేమించిన అబ్బాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అంటూ అఫీషియల్ గా ప్రకటించింది. ఇప్పుడు తాజాగా తన ప్రియుడిని సైలెంట్ గా వివాహం చేసుకుంది. మార్చి 20వ తేదీన వీరిద్దరి వివాహం ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ వేడుకలకు కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరైనట్లు వినిపిస్తున్నాయి. పునర్నవి వివాహం చేసుకున్న అబ్బాయి పేరు హేమంత్ వర్మ ఇతను కూడా ఒక పాపులర్ ఫోటోగ్రాఫర్ వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమలో ఉండి మరి వివాహం చేసుకున్నారు. ఈ జంట ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు నేటిజన్స్ సైతం ఈ జంటగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: