జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం డ్రాగన్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తూ ఉన్నారు. కేజిఎఫ్, సలార్ వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న డైరెక్టర్ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి అభిమానుల అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రాకపోతుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా ఇటీవల ఎన్టీఆర్ లుక్స్ కి సంబంధించి పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.


ముఖ్యంగా ఎన్టీఆర్ గతంలో కంటే ఎక్కువగా సన్నబడడంతో కొంతమంది షాక్ అవుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు తగ్గట్టుగా మారిపోతారని ఎన్నోసార్లు నిరూపించారు. ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా కోసం చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని  అందుకే గుబురు గడ్డంతో చాలా రగ్గడ్ లుక్ లో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ బాడీ బిల్డ్ కూడా ఈ సినిమా కోసం చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఫర్ఫెక్ట్ లుక్ లో కనిపించడానికి ఎన్టీఆర్ కేవలం ఏడువారాలలోని 10 కేజీల వరకు బరువు తగ్గిన సమాచారం.


ప్రతిరోజు గంట వ్యాయామంతో పాటుగా ప్రోటీన్ డైట్లను కూడా ఎన్టీఆర్ ఫాలో అవుతున్నారట. డ్రాగన్ సినిమా మొదల మొదలయ్యే సమయంలో కొంత బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత మళ్లీ సన్నగా కనిపించారు. దీంతో ఎన్టీఆర్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారా అనే విధంగా వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తి చేయాలని డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. మరి త్వరలోనే ఈ సినిమా అఫీషియల్ టైటిల్ తో పాటు ఎన్టీఆర్ కి సంబంధించి ఏదైనా అప్డేట్ విడుదల చేస్తారేమో చూడాలి మరి. చివరిగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: