బాలీవుడ్లో మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా అదరగొట్టేస్తున్న చిత్రం దురంధర్: ది రివేంజ్. ఈ సినిమా మార్చి 19న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయంతో దూసుకుపోతోంది. డైరెక్టర్ ఆదిత్య ధర్, రణవీర్ సింగ్ హీరోగా నటించారు. ఈ సినిమా కేవలం నాలుగు రోజులలోనే కళ్ళు చెదిరే కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ని అధికారికంగా జియో స్టూడియోస్ ప్రకటించింది.


ఇండియా వ్యాప్తంగా మొదటి రోజే రూ. 145 కోట్ల రూపాయల కలెక్షన్స్ తో భారీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. రెండవ రోజు రూ. 83 కోట్ల రూపాయలను రాబట్టగా మూడవరోజు వీకెండ్ కావడం చేత రూ. 117 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. ఆదివారం రోజు ఏకంగా 121 కోట్ల రూపాయలను రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది దురంధర్ 2. అయితే ఇండియాలో మాత్రమే రూ. 466 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక వర్కింగ్ డేస్ లో కూడా కలెక్షన్స్ బాగానే వస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.


అటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా దురంధర్ ప్రభంజనం భారీగానే కొనసాగుతోంది. విదేశాలలో ఇప్పటివరకు రూ. 211 కోట్ల రూపాయలు రాబట్టగా మొత్తం మీద చూసుకుంటే ఈ సినిమా నాలుగు రోజులకే ప్రపంచ వ్యాప్తంగా రూ .761 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కాబట్టి. దీన్ని బట్టి చూస్తూ ఉంటే త్వరలోనే ఈ సినిమా రూ .1000 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. మరి లాంగ్ రాంగ్ టైంలో ఎంత కలెక్షన్స్ రాబడుతుందనే విషయం చూడాలి మరి. ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించారు డైరెక్టర్ ఆదిత్యధర్. గత ఏడాది దురంధర్ సినిమాని విడుదల చేయగా అతి తక్కువ సమయంలోనే దురందర్ 2 సినిమాని విడుదల చేయడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయి భారీ కలెక్షన్స్ రాబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: