‘ప్రేయసిరావే’.. ఒక తీరని జ్ఞాపకం!
రాశి కెరీర్‌లో ఎన్నో హిట్లు ఉన్నా, ‘ప్రేయసిరావే’ సినిమా అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైన ఎమోషన్ . ."నన్ను హీరోయిన్‌గా చూడాలని మా నాన్న గారు ఎంతో తపన పడ్డారు. ఆయన వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన చివరిగా చూసిన నా సినిమా ‘ప్రేయసిరావే’. అందుకే ఆ సినిమాను నేను ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ రాశి ఎమోషనల్ అయ్యారు. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అగ్ర హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా వెలిగిపోయారు రాశి. .
‘మిక్స్డ్ బ్రీడ్’.. కులంపై రాశి క్లారిటీ!
సాధారణంగా హీరోయిన్లు తమ కులం లేదా వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు, కానీ రాశి మాత్రం చాలా ఓపెన్‌గా స్పందించారు. "అప్పట్లో నేను లావుగా ఉన్నానని చాలామంది అనేవారు. కానీ నేను పెళ్లి కోసమే లావు అయ్యాను. 22 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాను" అని క్లారిటీ ఇచ్చారు . . . తాను ఇలా కనిపించడానికి కారణం తన ‘మిక్స్డ్ బ్రీడ్’ అని రాశి పేర్కొన్నారు . . "మా నాన్న బ్రాహ్మిణ్, అమ్మ గౌడ. నాన్న కులమే వర్తిస్తుంది కాబట్టి నేను బ్రాహ్మిణ్ అయ్యాను" అంటూ తన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చారు.‘ప్రేయసిరావే’. . .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి