ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమంత.. సమాజంలో మహిళలు ఇతరుల కోసం తమ ఇష్టాలను లక్ష్యాలను వదులుకుంటున్నారని, కానీ ఇది దురదృష్టవశాత్తు త్యాగమని గుర్తించలేక మనం దీనికి అలవాటు పడిపోయాము. ఏదైనా చిన్న విషయం జరిగితే చాలు పురుషులకంటే మహిళలే పదిరెట్లు ఎక్కువగా క్షమాపణలు చెబుతూ ఉంటారని, ఇకపైన ఏ విషయంలో కూడా ఎవరు రాజు పడొద్దు క్షమాపణలు చెప్పుకోవడం మానుకోండి అంటూ తెలియజేసింది. మీరు కష్టపడి సంపాదించుకున్న గౌరవం నిలబెట్టుకోండి అంటూ తెలియజేసింది సమంత.
మహిళలు తమ వ్యక్తిత్వాన్ని చాటుకోవాలే తప్ప అనవసరంగా ఎక్కడ తలవంచకూడదు అంటూ తెలియజేసింది. భారతదేశంలో సినీరంగం మహిళలకి అంత సురక్షితమైనది కాదు అంటూ ఆమె ఎమోషనల్ గా తెలియజేసింది. ఉద్యోగ భద్రత, పనిగంటలు, రక్షణ వంటివి ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మహిళలు ఇండస్ట్రీలో వస్తున్నారంటే వారికి ధైర్యం ఉందని అర్థము ఇక్కడ పురుషులకంటే మహిళలే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. అలాగే సినిమాలను మేల్ ఓరియెంటెడ్, లేడి ఓరియంటెడ్ అని విడదీసి చూడడం ఆపాలి అంటూ తెలిపింది. హీరోయిన్ అంటే కేవలం సినిమాలలో గ్లామర్ కోసమే కాదు, హీరో చుట్టూ తిరగడానికి కాదు కథలో ధైర్యాన్ని నింపే ఒక పవర్ఫుల్ పాత్ర అయ్యి ఉండాలని తెలియజేసింది. ముఖ్యంగా సినిమా షూటింగ్ సెట్లలో మహిళలకు ప్రత్యేకించి సురక్షితమైన వాతావరణం కల్పించాలంటూ కోరింది సమంత.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి