టాలీవుడ్లో మెగా డాక్టర్ నిహారిక ఈ మధ్యకాలంలో నిర్మాతగా బాగానే సక్సెస్ అవుతోంది. ఎంచుకొనే కథలు కూడా ప్రేక్షకులను సరికొత్తగా ఆకట్టుకోవడంతో నిహారిక హీరోయిన్ గా కంటే నిర్మాతగానే బాగా పేరు సంపాదించింది. నిహారిక విడాకులు అనంతరం ఎక్కువగా ఏదో ఒక విషయంలో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. గడిచిన కొన్ని నెలల క్రితం హీరో విజయ్ దేవరకొండ తో పెళ్లి జరగబోతోందని పెద్ద ఎత్తున రూమర్స్ వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ పైన నిహారిక మాట్లాడుతూ అసలు విషయాన్నీ బయటపెట్టింది. నిహారిక నటించిన రాకాస సినిమా ఏప్రిల్ 3న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చింది.


నిహారిక మాట్లాడుతూ కొంతకాలం క్రితం తాను మరియు విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి అదే సమయంలో అనుకోకుండా తామిద్దరం ఒక సినిమా ఈవెంట్లో కలిసామంటూ తెలియజేసింది. ఆ సమయంలో ఆ వార్తలు మరింత వైరల్ గా మారడంతో విజయ్ దేవరకొండ స్వయంగా ఆ విషయం పైన స్పందిస్తూ నిహారిక తనకు చెల్లెలు అంటూ క్లారిటీ ఇచ్చారని నిహారిక తెలియజేసింది. అలాగే తాను నటించిన గీత గోవిందం చిత్రంలో నాగబాబు తనకు తండ్రి పాత్రలో నటించారు కాబట్టి నిహారికను చెల్లిలిగా భావిస్తానంటూ విజయ్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు.


నిహారిక నిర్మించిన రాకాస చిత్రంలో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తూ ఉండగా, నయన్ సారిక హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా రెస్పాన్స్ అద్భుతంగా లభించింది. ఈ చిత్రం కామెడీ హర్రర్ జోనర్ తో తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమా తర్వాత తన అన్న వరుణ్ తేజ్ తో కలిసి భరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా గ్రామీణ ప్రాంతంలో జరిగే వాలీబాల్  నేపథ్యంలో క్రీడా సినిమా అన్నట్లుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: