ఇక ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కూడా ఒక కీలక పాత్రలో కనిపించనుండటం మరింత ప్రత్యేకతను తెస్తోంది. ఇప్పటికే నాగార్జున–టబు కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో, ఈ సినిమా మీద ఆసక్తి మరింత పెరిగింది. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు.ఇటీవల వెంకటేష్‌తో కలిసి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఐశ్వర్య రాజేష్, ఇప్పుడు మరో పెద్ద ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఆమె కెరీర్‌కు మరింత బలం చేకూరుస్తుందని చెప్పాలి. వరుసగా పెద్ద హీరోలతో అవకాశాలు రావడం ఆమెకు ఇండస్ట్రీలో పెరుగుతున్న డిమాండ్‌ను స్పష్టంగా చూపిస్తోంది.
ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రా కార్తీక్ అనే యువ తమిళ దర్శకుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు కారణమయ్యాడు. నాగార్జున వంటి అనుభవజ్ఞుడైన స్టార్ హీరో తన ల్యాండ్‌మార్క్ మూవీ కోసం ఒక యువ దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఒక వైపు సాహసోపేత నిర్ణయంగా ప్రశంసలు అందుకుంటుండగా, మరోవైపు కొందరి నుంచి విమర్శలు, ట్రోల్స్ కూడా వస్తున్నాయి.ప్రత్యేకంగా సోషల్ మీడియాలో ఐశ్వర్య రాజేష్‌పై కొందరు నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే వయస్సులో పెద్ద హీరోతో నటించావు, ఇప్పుడు మళ్లీ అదే ట్రెండ్ కొనసాగిస్తున్నావా అనే విధంగా విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, నటిగా పాత్ర ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవడం సహజమని, వయస్సు కంటే కథ, పాత్ర బలం ముఖ్యమని ఆమె అభిమానులు సమర్థిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి