దీంతో ఈ చిన్న బ్రేక్స్ సుమారుగా 6 నెలల పాటు సాగడంతో సినీ నిర్మాణ సమయం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. దీంతో ముందుగా ఇచ్చిన నటీనటులు కాల్షిట్లు అన్ని కూడా తారుమారయ్యాయి. తాజాగా టోవినో థామస్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి కూడా ముఖ్య కారణం డేట్స్ సమస్య అన్నట్లుగా తెలియజేశారు. ఒక నటుడుగా తన సొంత మార్కెట్ ని కాపాడుకోవడానికి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలయాళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ సినిమాలో నటించాలంటే కేవలం డేట్లు మాత్రమే ఇస్తే సరిపోదు ఆ పాత్ర కోసం ప్రత్యేకమైన ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అవసరమని ఇందుకు చాలా సమయమే పడుతుంది.
టోవినో థామస్ మలయాళ ఇండస్ట్రీలో ఏడాదికి కనీసం మూడు నాలుగు అయిన సినిమాలు చేసే బిజీ హీరోగా పేరు సంపాదించారు. కేవలం ఒక విలన్ పాత్ర కోసం తన చేతిలో ఉన్న చిత్రాలను వదులుకోవడం అంటే ఆయన కెరీర్ పరంగా రిస్క్ అని చెప్పవచ్చు. గత నవంబర్ లో ఎన్టీఆర్ సినిమా విషయంపై ప్రశ్నించినప్పుడు ప్రస్తుతానికి తాను ఏమి చెప్పలేను అంటూ దాటివేయగా ఇప్పుడు అధికారికంగా తప్పుకున్నట్లు ధ్రువీకరించారు.
టోవినో థామస్ తప్పుకోవడంతో ఎన్టీఆర్ సినిమాలో ఎన్టీఆర్ తో ఢీ కొట్టే పాత్ర ఎవరై ఉంటారని అభిమానులు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి