ఇటీవల బండ్ల గణేష్ ఇంట్లో శుభకార్యం జరగబోతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కుమార్తె జానకి వివాహం త్వరలోనే జరగబోతుందనే సమాచారం సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ వార్తతో పాటు, పెళ్లి కాబోయే వధూవరుల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫోటోలలో జానకి సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తుండగా, వరుడు కూడా సాంప్రదాయ వేషధారణలో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. ఈ జంట కలిసి కనిపించిన ఫోటోలు చూసిన నెటిజన్లు, అభిమానులు ముందుగానే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అయితే ఈ విషయంపై బండ్ల గణేష్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, టాలీవుడ్ వర్గాల్లో మాత్రం ఈ పెళ్లి వార్తపై జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ శుభవార్తను ప్రకటించే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఇక బండ్ల గణేష్ కుటుంబంలో ఈ వివాహం ఘనంగా జరగబోతుందనే అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం మీద, ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పెళ్లికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తే ఇంకా హైలెట్ గా ఉంటుందని జనాలు ఆశ పడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి