ఈ మధ్య సినిమా థియేటర్లలో తమ అభిమాన హీరోల చిత్రాలు విడుదలయితే చాలు అభిమానులు చాలా హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయేలా విన్యాసాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా విడుదల సందర్భంగా కొంతమంది డమ్మీ ముసళ్ళను తీసుకొని వెళ్లి నానా హంగామా చేశారు. ఇప్పుడు తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రేస్ గుర్రం చిత్రం మళ్ళీ థియేటర్లో రీ రిలీజ్ చేశారు.



ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎనర్జిటిక్ యాక్టింగ్, శృతిహాసన్ అందచందాలు, బ్రహ్మానందం కామెడీ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా భారీ స్పందన లభించడంతో బన్నీ ఫ్యాన్స్ చేసే హంగామా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా థియేటర్ లోపలికి ఏకంగా నిజమైన గుర్రాలను తీసుకువచ్చి స్వారీ చేస్తూ అల్లు అర్జున్ పాటకు డాన్స్ వేస్తూ నానా హంగామా సృష్టించినట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఈ వీడియో చూసిన పలువురు అభిమానులు నేటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులలో కెల్లా అల్లు అర్జున్ అభిమానులు వేరయ్య సినిమా థియేటర్ల వద్దకు గుర్రాలను తీసుకురావడం ఐడియా చాలా వెరైటీగా ఉన్నది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్ బ్యానర్ పై రూ .800 కోట్లతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.చివరిగా పుష్ప 2 చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాశారు అల్లు అర్జున్. మరి అట్లీ సినిమాతో ఎలాంటి రికార్డులను తిరగరాస్తారో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి: