ఇటీవల జరిగిన ఒక ఇంటరాక్షన్‌లో నాగచైతన్య ‘వృషకర్మ’ గురించి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 85 శాతం పూర్తయిందని ఆయన కన్ఫర్మ్ చేశారు. మిగతా షూటింగ్‌ను కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నారట. దీన్ని బట్టి చూస్తుంటే, సినిమా విడుదల కోసం అక్కినేని అభిమానులు ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది. డెలివరీకి సిద్ధంగా ఉన్న ఈ 'మిస్టరీ బాక్స్' థియేటర్లలో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
'విరూపాక్ష'తో టెక్నికల్ వండర్ క్రియేట్ చేసిన కార్తీక్ దండు, ఈసారి కూడా విజువల్స్ మరియు సౌండ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదు. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ (కాంతార, విరూపాక్ష ఫేమ్) సంగీతం అందిస్తుండటం విశేషం. ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ థ్రిల్లర్ మూవీని మరో లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్ అంటేనే ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది.. మరి వృషకర్మ కోసం ఆయన ఎలాంటి ట్యూన్స్ సిద్ధం చేశారో!
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అధినేత బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిర్మాణ విలువల (Production Values) పరంగా ఎక్కడా వెనకాడకుండా, అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అక్కినేని నాగచైతన్య సరసన క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.పీరియాడిక్ మరియు అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే ఈ మిస్టరీ థ్రిల్లర్ చైతూ కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులను మెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి