ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇంస్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ గోల ఎక్కువగా వినిపిస్తోంది. సోషల్ మీడియా ద్వారా సెలబ్రెటీలు అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. సినిమా అప్డేట్లతో పాటు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటున్నారు. మరి కొంతమంది సెలబ్రిటీలు తమ గ్లామర్ తో మరింత ఆకట్టుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలోనే సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ ఉంటుందని చాలా మంది సోషల్ మీడియాలో సెలబ్రెటీలు హల్చల్ చేస్తున్నారు.యాంకర్ విష్ణు ప్రియ ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టి సుమారుగా కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తోంది.


నిరంతరం సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో, వీడియోలతో రచ్చ చేస్తున్న విష్ణు ప్రియ ఇప్పుడు సబ్ స్క్రిప్షన్ మొదలుపెట్టి మరి ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తోంది. రూ .390 రూపాయలు కడితే ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ అందిస్తామంటూ యూజర్స్ ని సైతం ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు విష్ణుప్రియ బాటలోనే మరో నటి అనన్య నాగళ్ల కూడా అదే పద్ధతిని మొదలుపెట్టింది. ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటు ఆఫర్ అందిస్తోంది.


తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కోసం నెలకు రూ. 390 రూపాయలు సబ్స్ట్రిక్షన్ ప్లాన్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఇందులో సాధారణంగా ఫాలోవర్స్ కి కనిపించని గ్లామర్ ఫోటో షూట్లు వీడియోలు సైతం, సబ్స్క్రిప్షన్ ప్లాన్ లో కనిపిస్తాయని చెబుతున్నారు. ఇక అనన్య నాగన్న కూడా ఇలాంటి సబ్ స్క్రిప్షన్ పెట్టడంతో అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మరి అనన్య నాగళ్ల సబ్స్క్రిప్షన్ లో ఏం కంటెంట్ ఇస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సబ్స్క్రిప్షన్ విషయంలో యాంకర్ విష్ణుప్రియ పైన కూడా పలు రకాల కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఆమె ఆదాయం రూ.18 లక్షల రూపాయల వరకు పెరిగినట్లు వినిపిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఈ సబ్ స్క్రిప్షన్ పద్ధతిని ఎంతమంది సెలబ్రేట్లు కొనసాగిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: