బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించిన అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పుడూ కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. ఇక ఈయన కుమార్తె నితారా కుమార్ ఆన్లైన్లో వేధింపులకు గురైనట్లుగా వినిపిస్తున్నాయి. ఈ వేధింపులకు పాల్పడిన నిందితుడిని , మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఛేదించి పట్టుకున్నారు.. పోలీస్ ఆఫీసర్ యశస్వి యాదవ్ మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్లో ముంబైలో జరిగిన సైబర్ అవేర్నెస్ మంత్ 2025 కార్యక్రమంలో భాగంగా అక్షయ్ కుమార్ అందులో పాల్గొనగా, ఈ విషయాన్ని ఆయన స్వయంగా బయటపెట్టారు.


తన 13 ఏళ్ల కూతురు పైన ఆన్లైన్లో వీడియో గేమ్ ఆడుతూ ఉండగా , ఒక  అపరిచితమైన వ్యక్తి నుంచి ఆమెకు మెసేజ్లు పంపించడం మొదలు మొదలు పెట్టారని, అసభ్యకరంగా మాట్లాడుతూ తన ఫొటోస్ పంపించాలనీ డిమాండ్ చేశారని అక్షయ్ కుమార్ తెలియజేశారు. ఈ ఘటన జరిగిన వెంటనే నితార ఏమాత్రం ఆలోచించకుండా ఆట వదిలేసి తన తల్లికి ఈ విషయాన్ని చెప్పిందని వెంటనే అక్షయ్ కుమార్ కూడా ఈ విషయం పైన సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. తన కుమార్తె చూపిన ధైర్యం వల్లే ఆ నిందితుడిని ఇప్పుడు పట్టుకున్నారని అధికారుల పైన ప్రశంసలు కురిపించారు.



లోతైన దర్యాప్తు తర్వాత నిందితుడిని మహారాష్ట్ర సైబర్ విభాగానికి చెందిన అధికారులు అదుపులోకి తీసుకొని మరి విచారిస్తున్నారు. ఈ విషయం పైన ఆందోళన చెందిన అక్షయ్ కుమార్ ప్రతి స్కూల్లో కూడా ఏడవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు సైబర్ అవేర్నెస్ క్లాసులు వారానికి ఒక్కసారిగా నిర్వహించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్ తీసుకున్న ఈ చొరవ చూసిన పలువురు నెటిజన్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవలే అక్షయ్ కుమార్ నటించిన బూత్ బంగ్లా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: