సాధారణంగా స్టార్లు స్టేజ్ పై చాలా ఫార్మల్ గా ఉంటారు. కానీ ఆమిర్ ఖాన్ మాత్రం తన సహజత్వంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈవెంట్ లో మాట్లాడుతున్న సమయంలోనే ఆమిర్ కు నేచర్ కాల్ (Natural Call) రావడంతో.. ఏమాత్రం మొహమాట పడకుండా “ఒక రెండు నిమిషాలు పర్మిషన్ ఇస్తారా? అర్జంట్ గా పాస్ వస్తోంది” అంటూ వేదిక దిగి వెళ్లిపోయారు. ఆమిర్ లోని ఈ నిజాయితీ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. “స్టార్ అయినా సరే మనలాంటి మనిషే కదా” అంటూ ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ ఈవెంట్ లో ఆమిర్ ఖాన్ సాయి పల్లవి గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. “ప్రస్తుతం మన దేశంలోనే బెస్ట్ నటి సాయి పల్లవి” అంటూ ఆమిర్ సర్టిఫికేట్ ఇచ్చేశారు.ఆమె నటనలో ఉండే స్వచ్ఛత, నిజాయితీ ఆమెను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లాయని ఆయన కొనియాడారు.
సాయి పల్లవి స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తాను ఆశ్చర్యపోయానని, ఆమెతో వర్క్ చేయడం జునైద్ కు దక్కిన గొప్ప అవకాశమని ఆమిర్ పేర్కొన్నారు.గతంలో కొన్ని నిరాశలు ఎదురైనప్పటికీ, జునైద్ ఖాన్ కు ‘ఏక్ దిన్’ సినిమా చాలా కీలకం. ఈ ఈవెంట్ లో జరిగిన సంఘటనలు, ఆమిర్ ఖాన్ ఎమోషన్, సాయి పల్లవి టాలెంట్ వెరసి ఈ సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచేశాయి. ఈ సినిమాతో జునైద్ బాలీవుడ్ లో తనదైన ముద్ర వేయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి