భద్ర (2005):బోయపాటి శ్రీనును దర్శకుడిగా పరిచయం చేస్తూ దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం రవితేజ కెరీర్‌లో ఒక మైలురాయి. ఇందులోని మాస్ ఎలిమెంట్స్ ఇప్పటికీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తాయి.
రాజా ది గ్రేట్ (2017): అంధుడిగా రవితేజ చూపించిన విశ్వరూపం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. “వెల్‌కమ్ టు మై వరల్డ్” అంటూ రవితేజ చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు.
గతంలో వీరి కాంబోలో ‘ఎవడో ఒకడు’ అనే సినిమా మొదలై ఆగిపోయింది. కానీ ఇప్పుడు యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ప్రాజెక్టుతో ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టడం గ్యారెంటీ అని ఇండస్ట్రీ టాక్.
వెరైటీ టైటిల్.. ‘అక్కాయిలూ... బాగున్నారా?’
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి, తన విభిన్నమైన టేకింగ్‌తో రవితేజ కోసం ఒక క్రేజీ కథను సిద్ధం చేశారట. ఈ సినిమాకు ‘అక్కాయిలూ... బాగున్నారా?’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. మొన్నటికి మొన్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే వెరైటీ టైటిల్‌తో షాక్ ఇచ్చిన రవితేజ, ఇప్పుడు మళ్ళీ ఈ వెరైటీ టైటిల్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ టైటిల్ వింటుంటేనే సినిమాలో ఏదో బలమైన కామెడీ మరియు ఎమోషనల్ పాయింట్ ఉందని అర్థమవుతోంది.
అన్‌స్టాపబుల్ ఎనర్జీ.. ‘ఇరుముడి’ నుంచి క్రేజీ ప్రాజెక్ట్ దాకా!
ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే డివోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే హసిత్ గోలి సినిమా పట్టాలెక్కనుంది. వయసు పెరుగుతున్నా రవితేజలో ఎనర్జీ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు సదా సత్యం. కథలో దమ్ముంటే చాలు, తన పెర్ఫార్మెన్స్‌తో సినిమాను ఒంటిచేత్తో గట్టెక్కించే సత్తా రవితేజ సొంతం.
హసిత్ గోలి మార్క్ మ్యాజిక్!
‘రాజ రాజ చోర’, ‘స్వాగ్’ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసిన హసిత్ గోలి, ఇప్పుడు ఒక మాస్ హీరోను ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు నిర్మాణ విలువలు, రవితేజ ఎనర్జీ, హసిత్ గోలి విజన్.. ఈ మూడు కలిస్తే బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజా జాతర మొదలైనట్లే!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి