దివ్వెల మాదిరి మాట్లాడుతూ.. సీనియర్ ఎన్టీఆర్ అంటే తనకి చాలా ఇష్టమని ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆరే మళ్లీ అంతటి ఇష్టం అయినా ఆయన సినిమా అంటే మొదటి రోజే చూస్తాను ఆయన బర్త్డే రోజు బ్లడ్ డొనేషన్ కూడా చేస్తానని, జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పెడితే ఆయన పార్టీలోకి చేరిపోతాం అంటూ తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి పార్టీ పెట్టే ఛరష్మా , సామర్థ్యం కలిగిన వారిని, ఆయన పార్టీ పెడితే కచ్చితంగా సీఎం అవుతారని, ఒకవేళ సీఎం అయితే ఎన్టీఆర్ సోషల్ సర్వీస్ కూడా బాగా చేస్తారని తెలియజేసింది.
దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. తనకు కూడా ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం ఆయన ఉండే పద్ధతి చాలా బాగుంటుంది. పార్టీ పెట్టగలిగే సమర్ధత ఆయనకు ఉంది చాలా మాట్లాడగలరు, పబ్లిక్ లో కూడా ఆయన మాట్లాడితే మంచి పాజిటివ్ రెస్పాన్స్ కలిగి ఉంది. విజయ్ గారు 12 ఏళ్లుగా పలు రకాల కార్యక్రమాలు చేస్తూ పార్టీ పెట్టి ఇప్పుడు గెలిచారు. ఆయన అభిమానులను చాలా తెలివిగాని పొలిటికల్ గా టర్న్ చేసుకోగలిగారు, విజయ్ సీఎం అవడం పెద్ద విశేషమేమీ కాదు, ఎంజీఆర్ దగ్గర నుంచి ఇప్పటివరకు చాలామంది సినీ నటులే అక్కడ పరిపాలించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. కానీ టిడిపి పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ప్రచారం చేశారు. పార్టీ కోసం చాలానే కష్టపడ్డారు కానీ ఇప్పుడు పట్టించుకోలేదంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి