ఈ మధ్య కాలంలో ఒకే లింగానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకోవడం ,సహజీవనం చేయడం ,పెళ్లి చేసుకోవడం అనేది చాలా సాధారాణమయిపోయింది.అప్పట్లో తమని తాము తమ లింగం గురించి వర్ణించుకుంటే సమాజం మమ్మల్ని ఎలా చూస్తుందో అన్న ధోరణిలో ఉండేవారు.కాని ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నం.ప్రతి ఒక్కరూ ఎంతో ధైర్యంతో తమ లింగాన్ని చెప్పేస్తున్నారు.సమాజంలో ప్రతి సగటు మానవుడు పొందే కనీస హక్కులను పొందటానికి పోరాటాలను కూడా చేస్తున్నారు.అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వాలు కూడా వారికి సమాజంలో ఒక స్థానం ,గౌరవాన్ని కల్పించేలా కొత్త సంస్కరణలను చేపడుతుంది.
వివరాల్లోకి వెళ్తే జూనో , ఇన్సెప్షన్ ,ఎక్స్ మెన్ వంటి సినిమాల్లో నటించిన హాలివుడ్ నటి ఎలెన్ పేజ్ తనని తాను లెస్బియన్ గా ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.ఈ అమ్మడు లెస్బియన్ గా ప్రకటించుకోక ముందు చాలా మంది మగాళ్ళతోనే అఫైర్లు కొనసాగించింది.అయితే ఇటీవల తనకంటే ఏడు సంవత్సరాలు చిన్నదైన డ్యాన్సర్ ఎమ్మా పోర్ట్ నెర్ తో సహజీవనం చేస్తున్నట్లు ప్రకటించింది.