హీరో సుమంత్ అశ్విన్, మెగా హీరోయిన్ నిహారిక హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘హ్యాపీ వెడ్డింగ్’. యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా పాజిటివ్ బజ్ మధ్య శనివారం విడుదలవుతోంది. పెళ్లి చుట్టూ అల్లుకున్న సున్నితమైన భావోద్వేగాలతో కుటుంబ కథా చిత్రంగా లక్ష్మణ్ కార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్ వర్క్ బీభత్సంగా చేశారు. టాలీవుడ్ సెలబ్రెటీలు సైతం ఈ కు ప్రమోషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి.
అయితే మెగా అమ్మాయి కొణిదెల నిహారిక నటిస్తున్న సినిమా .. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘హ్యాపీ వెడ్డింగ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరవడం, యూవీ క్రియేషన్ నిర్మించిన గత సినిమాలు సూపర్ హిట్‌గా నిలవడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఓవర్సీస్ నుంచి వస్తోన్న రిపోర్టుల ప్రకారం బాగుందని తెలుస్తోంది. అక్షర పాత్రలో నిహారిక ఒదిగిపోయిందని, తన తొలి సినిమాలో కంటే అందంగా కనిపించిందని టాక్.
ఇక సినిమా కథ విషయానికి వస్తే..ఆనంద్ (సుమంత్ అశ్విన్), అక్షర ప్రేమించుకుంటారు. ఈ జంట బాగుండటంతో..వీరికి పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారు. పెళ్లి దగ్గర పడుతుందనగా.. ఆనంద్‌ను పెళ్లి చేసుకునే విషయంలో అక్షర కన్ఫ్యూజన్కు లోనవుతుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ సీన్‌తో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది. అయితే సెకండ్ ఆఫ్ లో ఫీల్ గుడ్ మూమెంట్స్, చక్కటి డైలాగులతో పాటు మంచి ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నాయట.
కాకపోతే కొన్ని సీన్లు స్లోగా ఉన్నాయని టాక్. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని తెలుస్తోంది. అక్షర, ఆమె తండ్రి మధ్య వచ్చే సీన్ సినిమాకే హైలెట్‌గా నిలిచిందని చెబుతున్నారు. సాయంత్రానికి ఈ సినిమా ఎలా ఉందన్న టాక్ పూర్తిగా వస్తుంది..మరి సినిమాను ప్రేక్షకులు ఎలా ఆధరించారు..అన్న విషయం తెలిసిపోతుంది.