ఈ మద్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక్కటే భయం..తమ సినిమా సవ్యంగా థియేటర్లో ఆడి కలెక్షన్లు సాధిస్తుందా లేదా అని..ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందే నెట్టింట్లో ప్రత్యక్షం అవుతున్న రోజులు ఇవి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి దేశ విదేశాల్లో సినిమా చిత్రీకరణ చేసి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేసుకొని తీరా థియేటర్లో రిలీజ్ చేద్దాం అనే లోపు అప్పటికే వాట్సాప్, యూట్యూబ్ లో సినిమాలు పైరసీ కావడంతో దర్శెక, నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
గతంలో పవన్ కళ్యాన్ ‘అత్తారింటికి దారేది ’ మొదలు మొన్న విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’ వరకు రిలీజ్ కి వారం ముందే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇప్పుడు టాక్సీవాలా కూడా నెట్ లో ప్రత్యక్షం అయ్యిందని చిత్ర యూనిట్ బాధపడుతుంది. ఇక ఎంతో ప్రతిష్టాత్మంగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ రజినీకాంత్, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’.
చాలారోజుల క్రితమే సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పటికి సినిమా విడుదల కాలేదు. సినిమా విడుదలైతే ప్రేక్షకులకు విజువల్ వండర్ లా ఉంటుంది. అందుకే సినిమా విడుదల గురించి సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి బీబీసీ సంస్థ ఓ డాక్యుమెంటరీ చేస్తోంది.
ఈ డాక్యూమెంటరీలోని 2 నిమిషాల మేకింగ్ వీడియో లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమీ జాక్సన్, రజినీ లపై ఓ పాట చిత్రీకరణ వీడియో క్లిప్ నెట్టింట్లో వైరల్ గా మారింది. కాకపోతే ఈసారి ఇది లీకు కాదు. మేకర్స్ విడుదల చేసిన క్లిప్పింగ్స్. బీబీసీ వాళ్ల దృష్టిలో బ్రిటిష్ మోడల్, 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ పెద్ద స్టార్. ఆమెపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టి రజనీని సైడ్ చేసేశారు.