టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు సుకుమార్ తీసిన సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.  ఈ సంవత్సరం రాంచరణ్ తో తీసిన ‘రంగస్థలం’ మంచి సక్సెస్ సాధించడమే కాదు ఏకంగా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది.  ఆ మద్య ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో సినిమా సైతం ఘన విజయం సాధించింది. ఇంతవరకూ అల్లు అర్జున్ కి .. ఎన్టీఆర్ కి .. చరణ్ కి సుకుమార్ భారీ హిట్లను అందించాడు. ఈ స్టార్ హీరోలతో ఆయన చేసిన సినిమాలు ఒకదానికి మించి మరొకటి విజయాలను అందుకున్నాయి.

Image result for mahesh babu

 ఆ మద్య మహేష్ బాబు తో  తీసిన సినిమా కమర్శియల్ గా హిట్ కాలేదు..దాంతో మంచి మంచి కథతో మహేష్ కోసం సిద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.  కాకపోతే ఇంతవరకూ ఆయన చెప్పిన కథల పట్ల మహేశ్ బాబు సంతృప్తిని వ్యక్తం చేయలేదు. ఇప్పుడు సుకుమార్ చూపు ప్రభాస్ పై పడింది.  బాహుబలి లాంటి సీరీస్ లో నటించిన ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’ సినిమాలో నటిస్తున్నాడు.  

Image result for prabhas

ఈ సినిమా పూర్తయిన తర్వాత ప్రభాస్ తదుపరి సినిమాపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే  ప్రభాస్ ని కలిసి  ఒక లైన్ వినిపించి ఆయనతో ఓకే అనిపించేసుకుంటే, ఆ తరువాత పూర్తి కథను సిద్ధం చేసుకోవచ్చనే ఆలోచనలో సుకుమార్ వున్నాడని అంటున్నారు. అయితే ఇప్పుడు మహేష్ తో సినిమా తీస్తారా..లేక ప్రభాస్ తో సినిమా తీస్తార అన్న విషయం మరికొన్ని రోజల్లో తెలియనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: