రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ 2020 సమ్మర్ కు విడుదల అవుతుంది అని ప్రస్తుతానికి చెపుతూ ఉన్నా గతంలో రాజమౌళి పనితీరును పరిశీలించిన వారు ఖచ్చితంగా ఈమూవీ 2020 సమ్మర్ కు విడుదల అవుతుంది అని భావించడం కష్టమే అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో 2020 వరకు చరణ్ జూనియర్ లు రాజమౌళి బందిఖానాలో ఉండిపోతారు కాబట్టి ఈ గ్యాప్ ను సద్వినియోగం చేసుకోగల టాప్ హీరో ఎవరు అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగల చర్చలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ అవకాసం ఎక్కువగా ప్రభాస్ కు ఉంది. దీనికి కారణం భారీ అంచనాలతో రూపొందింపబడుతున్న ‘సాహో’ అదేవిధంగా ఇప్పటికే నిర్మాణం ప్రారంభం అయిన ప్రభాస్ రాధాకృష్ణల మూవీలు రెండు కూడ వచ్చే సంవత్సరమే విడుదల కాబోతున్నాయి. ఈరెండు సినిమాలు విభిన్న కథలతో కూడు కున్నవే కాకుండా ఈ రెండు సినిమా లపై భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. 

అదేవిధంగా మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం అతడు నటిస్తున్న ‘మహర్షి’ సినిమాతో పాటు మరొక సినిమాను ఎట్టి పరిస్తుతులలోను వచ్చే ఏడాది ముగిసే లోపుగా విడుదల చేసి తన వైపు నుండి కూడ వచ్చే ఏడాది రెండు సినిమాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ కూడ త్రివిక్రమ్ తో తాను కమిట్ అయిన సినిమాతో పాటుగా మరో యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో తన వైపు నుంచి తన రెండువ సినిమా కూడ ఉండేలా వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. 

దీనితో రాబోతున్న 2019 లో మహేష్ ప్రభాస్ బన్నీల మధ్య జరిగే పోటీ ఎంతో ఆసక్తి దాయకంగా మారడమే కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల అయ్యే లోపు ఈముగ్గురిలో ఎవరో ఒకరు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని శాసించడం ఖాయం అని అంటున్నారు. దీనితో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ఇవ్వబోతున్న గ్యాప్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అనుసరిస్తున్న వ్యూహాలలో ఈముగ్గురిలో ఎవరిది విజయం అన్న విషయమై ఆసక్తిర చర్చలు జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: