హీరో పుట్టిన రోజంటే.. అదిరే పార్టీలు.. పేజ్ త్రీ భామలు.. విందు విలాసాలకు అంతే ఉండదు. కానీ.. 36 వ వసంతంలోకి అడుగుపెట్టిన ఆది పినిశెట్టి తన పుట్టిన రోజును ఆదర్శంగా జరుపుకున్నారు. మానసిక వికలాంగులతో ఉల్లాసంగా గడిపారు. తన ప్రతి పుట్టిన రోజునూ ఇలాగే వికలాంగుల మధ్య జరుపుకుంటారు ఆది.

Image result for aadhi pinisetty birthday


వాస్తవానికి ఈరోజు తనకు చాలా బిజీ షెడ్యూల్ ఉందని.. కానీ వికలాంగుల మొహాల్లో చిరునవ్వులు పూయించడానికి తాను అవన్నీపక్కన పెట్టేశానని ఆది పినిశెట్టి చెబుతున్నారు. ఇక్కడకు వచ్చే ముందు వరుసగా 30 గంటలపాటు నిరంతరాయంగా షూటింగ్‌లో పాల్గొన్నాడట ఆది పినిశెట్టి.

Image result for aadhi pinisetty birthday


అంత అలసట ఉన్నా కూడా ముందుగా వస్తానని వికలాంగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే అక్కడికి వెళ్లానని ఆది చెప్పారు. అక్కడ గంటల కొద్దీ వారితో ఉల్లాసంగా గడిపారు. ఉదయం నాలుగు గంటల వరకూ పార్టీ జరిగిందట. తాను వికలాంగులతో కలసి దిగిన ఫోటోలను ఆయన ట్విట్టర్‌లో షేర్ చేశారు.

Related image


మానసిక వికలాంగులను మనం చాలా తక్కువగా అంచనా వేస్తుంటామని.. కానీ వారి టాలెంట్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపడాల్సిందేనంటున్నారు ఆది. వారితో గంటల తరబడి గడిపినా తనకు సంతృప్తి లేదని.. ఒకరోజు వారితో పాటే ఆ వికలాంగుల భవనంలో నిద్రించాలని ఉందని మనసులో మాట చెప్పారు. ఇటీవల గజ తుపాను తమిళనాడును గడగడ వణికించిన సమయంలోనూ ఆది పినిసెట్టి బాధితులకు అండగా నిలిచారు. నిజంగా ఆది గ్రేట్ కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: