ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు అంటూ ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు వ్యాఖ్యలు చేసిన పవన్ పోలింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడానికి ఏమాత్రం ఆసక్తి  కనపరచక పోవడం హాట్ టాపిక్ గా మారింది. పోలింగ్‌ ముగిసిన అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు అంతా పోలింగ్ సరళి పై ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పై తమ అభిప్రాయాలు వ్యక్త పరిచినా పవన్ మాత్రం ఈ విషయాల పై స్పందించడానికి ఏమాత్రం ఆసక్తి కనపరచక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి. 

దీనికితోడు పవన్ పోటి చేసిన రెండు స్థానాలలోనూ గెలుపు కష్టం అని విశ్లేషణలు వస్తున్న నేపధ్యంలో తన వ్యక్తిగత గెలుపు గురించి కూడ ఎటువంటి ప్రకటనా చేయకుండా పవన్ నిన్న పూర్తిగా ఆధ్యాత్మిక సేవలో కాలం గడపడం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1.32 కోట్ల విరాళాన్ని అన్నదానం నిమిత్తం ఇవ్వడమే కాకుండా అక్కడ ఆలయంలో చాల సేపు ఆధ్యాత్మిక సేవలో పవన్ కాలం గడిపాడు. 

అయితే పవన్ ఈ ఆలయానికి వచ్చాడు అని తెలుసుకుని మీడియా వర్గాలు ఆ ఆలయం వద్దకు వెళ్లి పవన్ తో మాట్లాడాలని ప్రయత్నించినా పవన్ స్పందించ లేదు అని తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల నేతలు తమ కోణంలో ఎన్నికల పోలింగ్ ను విశ్లేషిస్తారు. 
దీనికితోడు ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 40 రోజుల వరకు వ్యవధి ఉన్న నేపధ్యంలో తమ పార్టీ క్యాడర్ కు నిరాశ పడకుండా గెలుపు గురించి సంకేతాలు ఇస్తారు.

అయితే దీనికి భిన్నంగా పవన్ నిన్నటిరోజు అంతా పూర్తి ఆధ్యాత్మిక సేవలో కాలం గడపడం మీడియాకు మాత్రమే కాకుండా పవన్ అభిమానులకు కూడ అర్ధం కానీ విషయంగా మారింది. దీనితో సినిమాలు వదిలి రాజకీయాల బాట పట్టిన పవన్ ఇప్పుడు రాజకీయాల పై విరక్తి చెంది ఆధ్యాత్మిక బాట వైపు పయనిస్తున్నాడా అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి..    


మరింత సమాచారం తెలుసుకోండి: