అనుష్క ప్రధాన పాత్రలో  హేమంత్ మధుకర్ దర్శకత్వంలో   రాబోతున్న  సస్పెన్స్ థ్రిల్లర్  'సైలెన్స్'.  ఈ చిత్రం ఇటీవలే  సెట్స్ మీదకు వెళ్లిన సంగతి తెలిసిందే.  కాగా  ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించబోతుందట. అలాగే మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది.  ముఖ్యంగా   అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. 'అరుంధతి, భాగమతి' తరహా చిత్రాలు లాగానే ఈ సినిమాలో కూడా  అనుష్క పెర్ఫామెన్స్ నే  హైలెట్ కానుందని చెబుతుంది చిత్రబృందం.    


ఇక ఈ చిత్రంలో  అనుష్క, మాధవన్ లతో పాటు   సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ  హాలీవుడ్ నటుడు  మైఖేల్ మాడిసన్  ముఖ్య పాత్రల్లో  నటిస్తున్నారు. 'భాగమతి'గా  ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న  అనుష్క.. ఆ తరువాత చాలా రోజులు విరామం తీసుకుని ఈ సినిమాని చేస్తోంది.  మరి ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: