ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో గెలుపు ఎవ‌రిది? అంటే.. స‌హ‌జంగానే.. ఎన్ని క‌లు అయ్యాక చెబుతాం.. అనే మాట వినిపించ‌డం లేదు. ఎన్నిక‌ల పోలింగ్‌కు నెల రోజులు ముందుగానే ఇక్క‌డ టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని.. ఆ పార్టీ అభ్య‌ర్థిజీవీ ఆంజ‌నేయులు గెలుపు గుర్రం ఎక్కు తార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. దీనికి కార‌ణం.. ఇక్క‌డ ఉన్న రాజ‌కీయ ప‌రిణామాలు.. ప‌రిస్థితులే కార‌ణ‌మ‌ని చెబుతున్నారు.


వినుకొండ నియోజ‌క‌వ‌ర్గం అంటే.. జీవీకి కంచుకోట‌. 2009, 2014లో ఆయ‌నే విజ‌యం ద‌క్కించుకున్నారు. గత ఎన్నిక‌ల్లో మాత్రం స్వ‌ల్ప ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాలైనా ప్ర‌జ‌ల‌ను అంటి పెట్టుకున్నారు. వారి స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేశారు. వారితోనే ఉన్నారు. పిలిస్తే ప‌లికే నాయ‌కుడిగా జీవీ పేరు తెచ్చుకున్నారు. ఇక‌, ఇప్పుడుఈ నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ స‌మీక‌ణ‌లు కూడా మారిపోయాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వైసీపీలో ఉన్న మ‌క్కెన మ‌ల్లికార్జున రావు కూడా.. టీడీపీకి జై కొట్టారు.


ఈ ప‌రిణామం.. జీవీకి మ‌రింత ద‌న్నుగా మారింది. ఇరువురు నాయ‌కులు కూడా.. ప్ర‌చారాన్ని ఓ రేంజ్‌లో చేస్తున్నారు. చంద్ర‌బాబుప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ ప‌థ‌కాలు స‌హా.. పార్టీ కూట‌మి వ్య‌వ‌హారాన్ని వారు ప్ర‌ధానంగా ప్ర‌చారంలోకి తెస్తున్నారు. అదే స‌మ‌యంలో వైసీపీ  నాయ‌కుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు అరాచ‌కాల‌ను కూడా.. తెర‌మీదికి తెస్తున్నారు. ఈ ప‌రిణామాల‌తో టీడీపీ హోరు.. జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.


మ‌రోవైపు.. వైసీపీ నాయకులు టికెట్ ఇవ్వ‌ద్ద‌ని మొత్తుకున్నా.. అధిష్టానం ఏం ఆశించిందో తెలియ‌దు కానీ.. మ‌రోసారి బొల్లా బ్ర‌హ్మ‌నాయుడికే ఇక్క‌డి టికెట్ ఇచ్చారు. ఇది పార్టీకి పూర్తి మైన‌స్‌గా మారిపోయింది. మ‌రోవైపు.. ప్ర‌చారంలోనూ బొల్లా భారీగా వెనుక‌బ‌డ్డారు. దీంతో రాజ‌కీయంగా వైసీపీ వెనుక‌బ‌డిపోయింది. ఈ ప‌రిణామాలు.. జీవీకి క‌లిసి వ‌స్తున్నాయి. దీంతో ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌నే వాద‌న నెల రోజుల నుంచి వినిపిస్తుండ‌గా.. ఇప్పుడు ఆయ‌న మెజారిటీపైనే ఎక్కువ‌గా లెక్క‌లు వ‌స్తున్నాయి. ఈసారి ఖ‌చ్చితంగా 30 వేల ఓట్ల భారీ మెజారిటీతో ట్రెమండ‌స్ విజ‌యం సొంత‌మ‌ని జీవీ వ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: