ఒక్క సినిమా మూడు సంవత్సరాలు వెయిటింగ్..రిజల్ట్ ఎలా ఉంటుందో అన్న భయం..అందరూ వ్యంగంగా చూశారు. పోస్టర్స్, టీజర్స్ పై ప్రశంసలు కొంతమంది..విమర్శలు అనేక మంది. అయితే సినిమా రిలీజ్ అయ్యింది..టాప్ హీరో ఢీ కొంది..సూపర్ సక్సెస్ అయ్యింది. ఇంతకీ ఏం సినిమా అనుకుంటున్నారా ‘కొబ్బరిమట్ట’. అవును సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభినయంలో నటించిన కొబ్బరిమట్ట వాస్తవానికి మూడు సంవత్సరాల క్రితం మొదలై ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది.
ఇదే సమయంలో ఎన్నో అవాంతరాలు..విమర్శలు, సెటైర్లు దాంతో అసలు ఈ మూవీ ఒక్కరోజన్నా థియేటర్లో నడుస్తుందా అన్నంతగా టాక్ వచ్చింది. కానీ దర్శక, నిర్మాతలు హీరో సంపూ మాత్రం తమ సినిమాపై ఎంతో నమ్మకంతో ఉన్నారు. ఇందులో కొన్ని సీన్లలో సంపూర్ణేష్ బాబు నిజంగా విశ్వరూపం చూపించాడు. మొత్తానికి కింగ్ నాగార్జున మూవీ ‘మన్మథుడు2’ రిలీజ్ తెల్లారి కొబ్బరిమట్ట రిలీజ్ కావడం కామెడీ జోనర్ తో హిట్ టాక్ తెచ్చుకోవడం లాభాల పంట పండటం అన్ని జరిగిపోయాయి.
భారీ బడ్జెట్ పెట్టి దారుణంగా డిజాస్టర్స్ తింటున్న పెద్ద సినిమాలతో పోల్చితే ఈ మూవీ వంద శాతం బెటర్ అన్నారు. దాంతో టాలీవుడ్ లో సంపూకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. అతనితో సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. ఇటీవల దర్శకుడు క్రిష్ సైతం సంపూతో ఓ మూవీ తీయబోతున్నాడని వార్తలు కూడా వచ్చాయి. దర్శకుడు ఎవరనే విషయంతో పాటు మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, ఈ సినిమా దర్శక నిర్మాతలే సంపూతో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగినట్టుగా సమాచారం. పూర్తి హాస్యభరితమైన కథను సిద్ధం చేస్తున్నట్టుగా చెబుతున్నారు.ఇక నిర్మాత సి.కల్యాణ్ కూడా సంపూతో ఒక సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించిన ప్రకటన చేస్తాడని చెప్పుకుంటున్నారు. మొత్తానికి వరుస సినిమాలతో సంపూ టాలీవుడ్ ని దున్నెయబోతున్నాడన్నమాట.