టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత డి రామానాయుడు తనయుడు విక్టరీ వెంకటేష్ ‘కళియుగపాండవులు’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  మొదట్లో యాక్షన్ తరహా సినిమాల్లో నటించిన వెంకటేష్ తర్వాత ఫ్యామిలీ సినిమాలతో అలరించారు.  ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు.  ఈ సంవత్సరం వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ 2 మూవీ సూపర్ హిట్ అయ్యింది.  దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్ ’మూవీతో హిరోగా పరిచయం అయ్యాడు. 

మొదటి సినిమా మంచి సక్సెస్ సాధించినా తర్వాత సినిమాలు వరుస ఫ్లాపులు అయ్యాయి. కెరీర్ కొనసాగించాలంటే హీరో వేషాలే వేయ్యాల్సిన అవసరం లేదనే సిద్దాంతంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ తన సత్తా చాటాడు. సెకండ్ హీరోగా నటిస్తూ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించాడు.  ఇక రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి, బాహుబలి2’ సీరిస్ లో భళ్లాలదేవుడు పాత్రలో దుమ్మురేపాడు.  బాహుబలి గా ప్రభాస్ కి ఎంత క్రేజ్ వచ్చిందో..ఆ స్థాయిలో రానాకు పేరు వచ్చింది. 

ఆ తర్వాత తేజ దర్శకత్వంలో ‘నేనే రాజు..నేనే మంత్రి’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. రానాకు ‘ఘాజీ’ సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది.  గత కొంత కాలంగా రానా ఆరోగ్యానికి సంబంధించి రక రకాల కథనాలు వస్తున్నాయి. బాహుబలి లో ఎంతో గంభీరంగా కనిపించిన రానా..ఇటీవల కాలంలో పీలగా కనిపించడం అందరికీ షాక్ ఇచ్చింది.  కాగా, రానా ఆరోగ్యపరిస్థితి బాగోలేదని, కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రానా ఖండించారు.

దాదాపు మూడు నెలల క్రితం అమెరికా వెళ్లిన రానా ఇప్పటివరకు అక్కడే ఉండిపోయాడు. దీంతో ఆయన అంగీకరించిన సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయాయి.తాజాగా మరో 72 గంటల్లో భారత్‌కు రాబోతున్నానని రానా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. వచ్చిన వెంటనే వేణు ఉడుగుల దర్శకత్వంలోని `విరాటపర్వం` షూటింగ్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో `హిరణ్య` సినిమాను ప్రారంభించాలని రానా భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: