నేటితరం అమ్మాయిల డార్లింగ్ ప్రభాస్. ఈరోజు ఒక ప్రముఖ పత్రికతో షేర్ చేసుకున్న ఇంటర్వ్యూలో నేటి టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం పై ఆశక్తికర కామెంట్స్ చేసాడు. నేటి టాప్ హీరోల మధ్య ఆధిపత్య పోరు విపరీతంగా ఉన్నా టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం అనేది ఏ హీరోకు ఒకటి రెండు సూపర్ హిట్లతో వచ్చే స్థానం కాదని అభిప్రాయ పడ్డాడు ప్రభాస్. ఈ స్థానం వరస తప్పని విజయాలతో కనీసం ఒక దశాబ్ద కాలం టాలీవుడ్ లో కొనసాగిన హీరోలకే ఈ నెంబర్ వన్ స్థానం దక్కుతుందని ప్రభాస్ అభిప్రాయం. అయితే ప్రస్తుతానికి తనకు టాలీవుడ్ నెంబర్ వన్ స్థానం పై కోరిక, ఆశ కాని లేవు అంటూ తనకు 18 ఏళ్ళు వచ్చే వరకు తన పొడుగు అద్దంలో చూసుకుని తాను ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడినని అంటూ తాను సినిమా రంగంలోకి వచ్చిన తరువాత మాత్రమే తనకు హైట్ కు ఎంత ప్రాధాన్యత ఉందొ అర్ధం అయింది అని అంటున్నాడు ఈ బాహుబలి రాజకుమారుడు. తాను ప్రస్తుతం నటిస్తున్న ‘బాహుబలి’ సినిమా గురించి మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి రాజుల కాలం నటి దుస్తులు వేషాలు అంటే చాల ఇష్టమని అందుకోసమే ఈ సినిమాకు తాను ఎంత కష్ట పడుతున్నా ఆ కష్టం తెలియటం లేదని అని అన్నాడు ప్రభాస్. అందం ముఖ్యమైన విషయమే అయినా అంతకు మించి మంచితనాన్ని వ్యక్తిత్వాన్ని తన భార్యలో ఉండాలని కోరుకుంటున్నాను అని కోరుకుంటున్న ప్రభాస్ కోరిక నెరవేరాలని ఆశిద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: