తెలుగులో ఆటల నేపథ్యంలో వచ్చిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే వాటిలో హిట్ అయినవి కొన్నే. ఇప్పుడు మరో పెద్ద హీరో ఆ బాటలో వెళ్లనున్నాడు. అది మరెవరో కాదు... రవితేజ. అశ్వినీదత్ చాన్నాళ్ల తరవాత నిర్మిస్తున్న చిత్రం సారొస్తారు. దీనికి దర్శకుడు పరశురామ్. పాండవులు ఎంతమంది అంటే... నాలుగువేళ్లు చూపించి, మంచంకోళ్లలా బోర్డుమీద మూడువేసి మళ్లీ చెరిపేసి రెండువేసే రకమని పరశురామ్ ని అంటుంటారు. తాను అనుకున్నది ఒకటి. కథ చెప్పేటప్పుడు... ఆయన చెప్పిన తీరు వింటే అద్భుతం తీస్తాడనుకుంటారు. కానీ, షూటింగ్ లో కాస్త తగ్గుతుంది. సినిమా విడుదలయ్యే సరికి ఏదో తీశాడులే అనిపిస్తాడు. అలాంటి పరశురామ్ తో రవితేజ సారొస్తారు చేస్తున్నాడు. ఇందులో రవితేజ ఫుట్ బాల్ కోచ్ గా కనిపిస్తాడట. మామూలు ప్రేమకథలనే చక్కగా తీయలేని పరశురామ్... ఈ ఫుట్ బాల్ కథని ఏ మేరకు రక్తికట్టిస్తాడో మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: