తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్(టాంజ్) ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణా ఢిల్లీ అధికార ప్రతినిధి రామచంద్రు తేజావత్ దంపతులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఆక్లండ్ విమానాశ్రయంలో టాంజ్ ప్రెసిడెంట్ కల్యాణ్ కాసుగంటి, అడ్వైజరీ కమిటీ సభ్యులు జగన్ వడ్నాల తేజావత్ దంపతులకు ఘన స్వాగతం పలికారు.మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని తేజావత్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.