
‘ఏటా హెచ్1-బి వర్క్ వీసాల కోసం ఏప్రిల్ 3 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంటాం. తొలివారంలోనే 2.40 లక్షల దరఖాస్తులు వస్తాయి. 15 రోజుల్లో వీటిని ప్రాసెస్ చేయడం అసాధ్యం. ఆ రద్దీని తగ్గించేందుకే ప్రీమియం ప్రాసెసింగ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశాం. సస్పెన్షన్ ఎత్తివేయగానే ప్రీమియం ప్రాసెసింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటిని 15 రోజుల్లో పరిష్కరిస్తాం. అదీగాక ఏప్రిల్‌లో దరఖాస్తు చేసుకునేవారు ఈ విషయం గమనంలో ఉంచుకోవాలి. ఏ సందర్భంలోనైనా అక్టోబరు దాకా వీసాలు మంజూరు కావు కదా! అందుకే వీసా జారీలో ఆలస్యం జరుగుతోందని అనుకోరాదు’ అని అన్నారు. ప్రీమియం ప్రాసెసింగ్‌కు గతంలో గరిష్ఠంగా మూడు నెలలు పట్టేదని, గతంలోనూ సస్పెండ్ చేసిన సం దర్భాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు డేటాను సిస్టమ్‌లో నిక్షిప్తం చేయగానే.. ప్రీమియం ప్రాసెసింగ్‌కు అవకాశమిస్తామని, అవసరమైనవారు దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లోనే ప్రక్రియ పూర్తవుతుందని సియలబ్బా వెల్లడించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి