ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది భారతీయులు తమ దేశ కీర్తి ప్రతిష్టలు పెంచుతూ భారతీయులు అంటే ఎంతో గుర్తింపు తీసుకువచ్చేల చేస్తుంటే. లండన్ లో ఉన్న ఓ ఎన్నారై మాత్రం భారత పరవు పోగొట్టాడు. చివరికి అరెస్ట్ అయ్యాడు. ఇంతకీ అతడు చేసిన దారుణం ఏమిటనే వివరాలలోకి వెళ్తే.

 

లండన్ లో క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తున్న భారత సంతతికి చెందిన టెమూర్ అనే ఎన్నారై ఉబర్ సంస్థలో పని చేస్తున్నాడు. ఒక రోజు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సుమారు 25 ఏళ్ళ యువతి అందులోనూ గర్భవతి అతడి కారు ఎక్కింది. పలానా చోటుకు వెళ్ళాలని చెప్పింది. ఈ క్రమంలో ఆమె వెనుక సీటులో కూర్చుని ఉండగా ముందుకు రమ్మని  టెమూర్ పదేపదే చెప్పడంతో ఆమె ముందుకు వచ్చి కూర్చుకుంది.

 

కాసేపటి తరువాత అతడు ఆమెని లైంఘికంగా వేధించడం మొదలు పెట్టాడు. కారు తలుపు సరిగా వేయలేదు అనే వంకతో ఆమెని ముట్టుకొని చోట చేతులు వేయడం, ఆమె వాంతులు వస్తున్నా సమయంలో పట్టుకోవడం చేస్తూ ఎంతో అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆమె వారించినా వికపోవడంతో తన ఇల్లు చేరుకోగానే అతడిపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. దాంతో అతడిని  అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. శిక్ష రుజువయితే ఈ కేసులో అతడు  సుమారు 5 ఏళ్ళ పాటు జైలు జీవితం గడపాల్సిందే అంటున్నారు అధికారులు.


మరింత సమాచారం తెలుసుకోండి: