మన తెలుగు సంస్కృతి అన్ని దేశాలలో మంచి ప్రాచుర్యం లో ఉంది. మన సంగీతం , నాట్యం, కళారంగానికి  విదేశీయులకు మంచి మక్కువ ఎక్కువ విదేశీయులు చాల మంది ఇష్టం తో నేర్చుకుంటున్నారు అంటే మన సంస్కృతి పైన వారికున్న ఆసక్తి చూసే మన తెలుగు వాళ్ళు ముక్కున వేలేసుకుంటున్నారు. అదేవిదంగా  అమెరికాలో తెలుగు బాషా మాట్లాడే వారి సంఖ్య రోజు రోజు కి పెరిగి పోతుంది.


అమెరికాలో అత్యధిక మంది మాట్లాడుతున్న భారతీయ భాషల్లో తెలుగు మూడోస్థానంలో నిలిబడింది. అక్కడ హిందీ మొదటి స్థానంలో  నిలవగా రెండోస్థానంలో గుజరాతీ, మూడో స్థానంలో తెలుగు భాషలున్నాయి. అయితే ఏటా అమెరికాలో తెలుగు మాట్లాడే వారి సంఖ్య ఆశ్చర్యకరంగా  పెరుగుతుంది. గత పది సంవత్సరాల లో అమెరికా లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య  గణనీయంగా పెరగడం గుర్తించాల్సిన విషయం.

ఇటీవలే అమెరికా జరిపిన జనాభా లెక్కల సర్వే రిపోర్ట్  విడుదల చేసింది. దీని ప్రకారం అమెరికాలో 8.74 లక్షల మంది హిందీ మాట్లాడుతున్నారు. గతం తో పోలిస్తే  ఇప్పుడు హిందీ మాట్లాడే వారి సంఖ్య సగానికి సగం  పెరిగింది అని అలాగే అమెరికా లోని  చాల మంది తమ ఇళ్లలో ఇంగ్లిష్‌లో కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుతున్నారని తెలిపింది.గతం లో  అమెరికాలో 2.23 లక్షల మంది తెలుగు మాట్లాడేవారు ఉండగా ఇప్పుడు  ఆ సంఖ్య 4 లక్షలకు చేరింది. 


ఈ ఎనిమిది సంవత్సరాలలో  బెంగాలీ మాట్లాడే వారు 68 శాతం, తమిళం మాట్లాడే వారు 67.5 శాతం పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. ఇండియా నుంచే కాకుండా బంగ్లాదేశ్ నుంచి వలస వెళ్లిన వారు కూడా బెంగాలీ మాట్లాడుతారనే విషయము తెలిసిందే. అలాగే శ్రీలంక, సింగపూర్, మలేసియా నుంచి కూడా తమిళం మాట్లాడే వారు వచ్చి అమెరికాలో స్థిరపడే అవకాశం  కూడా ఉంటుంది. అయితే దీని ద్వారా దేశం తో సంబంధం లేకుండా భాష ని మాట్లాడుతున్నారని తెలుస్తుంది. అయితే తెలుగు కు పాశ్చాత్య దేశాలలో మంచి గుర్తింపు పెరుగుతుంది అని దీని ద్వారా అవగతం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: