అమెరికాలో 145 మంది భారతీయులను అక్రమంగా వారి దేశంలో ప్రవేశించారని వారిని దేశ బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే విరందురు మొన్న బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అయితే వీరందరూ కొన్ని సంవత్సరాల క్రితం ఏజెంట్ల సహాయంతో యూఎస్ చేరుకున్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. 

                     

అయితే వీరిలో కొందరు వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా అక్కడే ఉంటున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు ధృవీకరించాగా. మరికొందరు అమెరికాలో అక్రమంగా ప్రవేశించారు. దీంతో వారిని అక్కడి అధికారులు కాళ్లు, చేతులు కట్టేసి ప్రత్యేక విమానంలో పంపించారని బుధవారం స్వదేశానికి వచ్చిన 145 మంది భారతీయులు వాపోయారు. 

                        

తొలుత అక్రమ వలసదారుల శిబిరంలో నిర్బంధించిన అమెరికా అధికారులకు భారత అధికారులు తాత్కాలిక అనుమతి పత్రాలు ఇవ్వడంతో తిరిగి వచ్చామని వారు చెప్పారు. కాగా వారు ఈక్వెడార్‌, దక్షిణ అమెరికా దేశాల్లోని ఏజెంట్లకు రూ.25 లక్షలు చెల్లించి అమెరికాలోకి ప్రవేశించామని బాధితులు తెలిపారు. 

                                

కాగా, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరో ఐదుగురు భారతీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని న్యూయార్క్‌లోని ఓగ్డెన్స్‌బర్గ్ బోర్డర్ పెట్రోలింగ్ స్టేషన్‌కు తరలించారు. వీరి వద్ద ఎలాంటి ఇమ్మిగ్రేషన్ పత్రాలు లేవని అధికారులు తెలిపారు. చట్టవిరుద్ధంగానే యూఎస్‌లోకి ప్రవేశించారని నిర్ధారించి అరెస్ట్ చేశారు. అనంతరం తదుపరి ప్రాసెసింగ్ కోసం న్యూయార్క్‌లోని ఓగ్డెన్స్‌బర్గ్ బోర్డర్ పెట్రోలింగ్ స్టేషన్‌కు తరలించారు. అలాగే గత నెల 23న కూడా 117 మంది భారతీయులను అమెరికా బహిష్కరించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: