కరోనా ధాటికి అమెరికా కుదేలయ్యి పోయింది. అగ్ర రాజ్యా ఆధిపత్య హోదా సైతం పడిపోతుందా అనేంతగా అమెరికా పరిస్థితి నెల రోజుల కాలంలో సందిగ్ధంలో పడిపోయింది. ఆర్ధిక మాంద్యం ఒక వైపు, నిరుద్యోగ సమస్య మరొకవైపు..లెక్కకి మించిన కరోనా కేసులు..ఇలా ట్రంప్ చుట్టూ సమస్యలు చుట్టుముట్టాయి. ఈ విపత్కర పరిస్థితికి చైనానే కారణం అంటూ ట్రంప్ మెల్లగా తప్పించుకుంటున్నాడు..కానీ రాజకీయ ప్రత్యర్ధులు, నిపుణులు మాత్రం ట్రంప్ అలసత్వం వలనే ఇలాంటి దుస్థితి దాపరించింది అంటూ ప్రతీ రోజు ట్రంప్ పై వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు..కానీ తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేయడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డట్టయ్యింది..

IHG

ఒబామా పై అమెరికా ప్రజలకి పూర్తి నమ్మకం ఉంది. ఇప్పటికి మళ్ళీ ఒబామా అధ్యక్షుడిగా రావాలని అమెరికా ప్రజలు కోరుకుంటూనే ఉంటారు. అలాంటి ఒబామా నుంచీ ఒక్క మాట వెలువడినా అది ట్రంప్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలోనే ఒబామా ట్రంప్ పై తీవ్ర విమర్శలు చేయడం సంచలన సృష్టించింది. కరోనా అమెరికాపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడానికి ప్రధాన కారణం ట్రంప్ అంటూ ఒబామా ట్రంప్ పై మండిపడ్డారు..

IHG

ఈ మహమ్మారి వైరస్ ని ఎదుర్కోవడం లో ట్రంప్ పూర్తిగా వైఫల్యం చెందారని మీడియా ముఖంగా ఫైర్ అయ్యారు. వైట్ హౌస్ లో తనతో కలిసి పనిచేసిన వారిని కలిసి మాట్లాడిన తరువాత  ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ట్రంప్ అలసత్వం కారణంగా అమెరికాలో పరిస్థితి చేయి దాటిపోయిందని. ఎంతో మంది అమెరికన్స్ మృతికి కారణం ట్రంప్ అని దుయ్యబట్టారు. అంతేకాదు ఇలాంటి అధ్యక్షుడు ఉన్నందుకు మేము ఎంతో సిగ్గుపడుతున్నాం అంటూ ఒబామా లాంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడంతో అమెరికా రాజకీయాల్లో వేడిపుట్టినట్టయ్యింది. ఒబామా చివరిగా అమెరికా ప్రజలు జో బిడెన్ కి రానున్న ఎన్నికల్లో పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: