అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ వార్తల్లో వ్యక్తిగానే నిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ట్రంప్ అనుసరిస్తున్న ఆయన వ్యవహార శైలి కేవలం ఆయన పార్టీకి మాత్రమే కాదు ఆయన రాజకీయ భవిష్యత్తుని సైతం ఆందోళనలోకి నేట్టేసేలా ఉందని అంటున్నారు రిపబ్లికన్ పార్టీ నేతలు. గత కొంత కాలంగా ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు అమెరికా ప్రజలకి రుచించడం లేదని..కరోనా నియంత్రణ విషయంలో తమ ప్రభుత్వం తీవ్ర వైఫ్యలం చెదతంతో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని అందోళన చెందుతున్న రిపబ్లికన్ పార్టీ తాజాగా జరిగిన నల్లజాతీయుడి మరణం తరువాత  జరుగుతున్న పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

 

అమెరికాలో నల్ల జాతీయుడు జార్జి హత్య నేపధ్యం తెలిసిందే. ఈ క్రమంలో నల్లజాతీయుడు అందరూ అమెరికాలో చేపడుతున్న నిరసనలని ప్రపంచం మొత్తం కళ్ళప్పగించి చూస్తోంది. ఈ విషయంలో ట్రంప్ వ్యవహార శైలిపై అమెరికాలో నిరసనలు రేగుతున్నాయి. ట్రంప్ నిందితులపై చర్యలు తీసుకోవాలని నల్లజాతీయులు పట్టుబడుతున్న క్రమంలో ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు మరింతగా వారిని రెచ్చగొడుతున్నాయి. గతంలో మీపై మిలటరీని దింపుతామని వ్యాఖ్యలు చేసి నిరసనలను మరింత ఉదృతం అయ్యేలా చేసిన ట్రంప్ తాజాగా మరిన్ని విమర్శలు చేశారు..

 

మా వద్ద ప్రమాదకరమైన కుక్కలు ,అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయని వాటితో మీ అంతు చూస్తానని బెదిరించిన ట్రంప్ వ్యవహార శైలిపై ఒక్క సారిగా నిరసన కారులు బగ్గుమంటున్నారు. ఇప్పటికే నిరసన కారులని అడ్డుకోవడానికి ఎన్నో అవస్థలు పడుతుండగా తాజగా ట్రంప్ వ్యాఖ్యలకి మరింతగా ఆందోళనలు రేగడంతో ఆందోళన కారులని అదుపు చేయడం కష్టమవుతోందని అంటున్నారు అధికారులు. ఇదిలాఉంటే. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం..నల్ల జాతీయులపై అమానుషంగా దాడులు చేయడం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ట్రంప్ శైలి రిపబ్లికన్ పార్టీ పై భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపుతుందని తలలుపట్టుకుంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏది ఏమైనా కరోనా దెబ్బకే ట్రంప్ అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నిక అవ్వడం కష్టమని తెల్చుతుంటే..తాజా సంఘటనతో ఇక ట్రంప్ అధ్యక్షుడు కావడం కలే అంటున్నారు పరిశీలకులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: