ఏ దేశంలో ఉన్నా..ఎలాంటి వృత్తిలో ఉన్నా నిబద్దతతో పనిచేస్తూ ఘనమైన కీర్తిని తమకి మాత్రమే కాకుండా పుట్టిన దేశానికి కూడా అందించడంలో భారతీయులు ఎప్పుడూ ముందు ఉంటారు. ఎంతో మంది భారతీయులు విదేశాలలో స్థిరపడి అక్కడ వివిధ రకాల వృత్తులు చేపడుతూ, వారి వారి వృత్తుల పరంగా ఉన్నత స్థానాలని అధిరోహిస్తూ భారత్ గర్వించదగ్గ వ్యక్తులుగా కీర్తించా బడుతున్నారు. మరి కొందరు ఉన్నత విద్య కొరకు విదేశాలు చేరుకొని చక్కని ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ కోవకి చెందినా వారే కళా నారాయణ స్వామి.

IHG

భారత దేశానికి చెందిన కళా నారాయణస్వామి సింగపూర్ లోని ఉడ్ ల్యాండ్ హెల్త్ క్యాంపస్ లో నర్సింగ్ డిప్యుటీ డైరక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నో ఏళ్ళ క్రితమే భారత్ నుంచీ సింగపూర్ లో వచ్చి స్థిరపడిన ఆమె స్థానికంగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. కరోన కష్టకాలంలో సింగపూర్ లో ఈ మహమ్మారి వైరస్ బారిన పడిన వారికి చికిత్సలు అందించడంలో ఆమె చూపిన ప్రతిభ అనిర్వచనీయమనే చెప్పాలి. 2003 లో సార్స్  ఈ స్థాయిలోనే ప్రభావం చూపిన సమయంలో దాని ప్రభావాన్ని కంట్రోల్ చేసే సమయంలో అప్పటి పద్దతులని ఆమె నేర్చుకున్నారు...అయితే

IHG

ప్రస్తుతం కరోనా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న క్రమంలో కళా నారాయణ స్వామీ సార్స్ సమయంలో నేర్చుకున్న పద్దతులని ఇప్పుడు సింగపూర్ లో పాటిస్తున్నారని, ఇవి ఎంతో సత్పలితాలని ఇస్తున్నాయి. దాంతో ఆమె సేవలని గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం ఆదేశ అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెంట్ అవార్డ్ తో ఆమెని సత్కరించారు. ఆమె వయసు ప్రస్తుతం 59 అయినా ఆమె ఎంతో ఓపికగా, ధైర్యంగా రోగుల కోసం పనిచేయడం ఎంతో గొప్ప విషయమని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు అవార్డ్ తో పాటుగా 7,228 డాలర్ల ను సింగపూర్ ప్రభుత్వం కానుకగా అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: