ఒకప్పుడు అమెరికా అనగానే చాలా మందికి ఒక రేంజ్ లో ఫ్యాషన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమెరికా వెళ్ళడం, అమెరికాలో ఉండటం అనేది చాలా మందికి ఒక డ్రీం. ఉద్యోగాలు చేయాలి స్థిరపడాలి అని చాలా మంది కోరుకునే పరిస్థితి ఉండేది. పిల్లను ఇవ్వాలి అంటే అమెరికా అల్లుడికి ఇవ్వాలి అంటూ తల్లి తండ్రులు కూడా భావించే పరిస్థితి ఉండేది అప్పట్లో అనే మాట వాస్తవం. ఇదిలా ఉంటే ఇప్పుడు అమెరికా అంటే చాలు చాలా మంది భయపడే పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం.

అసలు అది ఏంటీ అంటే.. కరోనా దెబ్బకు అమెరికాలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అక్కడ అసలు చాలా మంది పార్ట్ టైం ఉద్యోగాలు పోయాయి అనే వార్తలు వస్తున్నాయి. అమెరికాలో చాలా మంది మన దేశం నుంచి వెళ్ళిన ఉద్యోగాలు ఉన్నారు. వారు అందరికి కూడా ఇప్పుడు అక్కడ ఉపాధి దాదాపుగా లేదు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుని బ్రతికే వాళ్ళు తల్లి తండ్రుల మీద ఆధారపడకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. కాని ఇప్పుడు మాత్రం వాళ్ళు అందరూ కూడా రోడ్డున పడ్డారు.

అక్కడి నుంచి వచ్చేసి భారత్ లోనే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాలి అని భావిస్తున్నారు గాని అక్కడ అసలు వద్దు అనే నిర్ణయానికి చాలా మంది వచ్చారు. అటు తల్లి తండ్రులు కూడా తమ పిల్లలు అమెరికాలో వద్దు అని చెప్పేస్తున్నారు. దీనితో అమెరికాలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రభావం మన వారి మీద గట్టిగానే పడింది. మరి ఎంత మంది అమెరికా నుంచి వచ్చేస్తారు నేది చూడాలి. అటు అమెరికా సర్కార్ కూడా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి  ఉంది. ట్రంప్ ఇప్పుడు కాస్త కఠినం గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: