అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా ఏదోక వివాదాస్పద వ్యాఖ్యలు  చేస్తూనే ఉంటారు. రాజకీయంగా అమెరికాలో ఇప్పుడు ఆయనకు అనుకూలంగా ఎంత మాత్రం కూడా వాతావరణం లేదు అనే విషయం  స్పష్టంగా అర్ధమవుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం కష్టపడే వ్యక్తి అన్ని వర్గాలను చాలా వరకు జాగ్రత్తగా ఆకట్టుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఏది పడితే అది మాట్లాడితే అనవసరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. ఆ  విషయం తెలియని ట్రంప్ ఏది పడితే అది మాట్లాడుతూ వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు.

జో బిడెన్ ని టార్గెట్ చేసే క్రమంలో కమలా హారిస్ మీద కూడా ఆయన తీవ్ర విమర్శలు చేసారు. ఇక తాజాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా వాతావరణ పరిస్థితిపై నిర్వహించిన డిబేట్ లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఇండియాని కూడా ఆయన విమర్శించడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. వాతావరణ పరిస్థితి గురించి మాట్లాడే క్రమంలో ట్రంప్ ఒక వ్యాఖ్య చేసారు. ఇండియా చూడండి ఎంత మురికిగా ఉందో, చైనా రష్యా చూడండి ఎంత మురికిగా ఉన్నాయో అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

అక్కడ గాలి కూడా కలుషితం అయ్యింది అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఇప్పుడు ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంత వరకు భావ్యమని నిలదీస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడానికి ఇలాంటి వ్యాఖ్యలు కచ్చితంగా కారణం అవుతాయని బలమైన ఓటు బ్యాంకు ఉన్న  భారతీయులను ఆయన దూరం చేసుకోవడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్తులో ట్రంప్ ని ఇండియా నమ్మకపోవడానికి ఇలాంటి వ్యాఖ్యలే కారణం అవుతాయని అని పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఆయన మార్చుకుంటారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: