ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని కీలక మార్పులు ఆంధ్రప్రదేశ్ లో చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పుల విషయంలో ఎవరు ఏవిధంగా అనుకున్నా సరే ఆయన మాత్రం కొన్ని విషయాలలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గలేదు. రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ బలంగానే ఉన్నా సరే కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు కూడా జగన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు అంతేకాకుండా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళే విద్యను అభ్యసించే వారి విషయంలో జగన్ కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ప్రధానంగా జగన్ కు కొన్ని సామాజిక వర్గాలకు అండగా నిలిచాయి. ఇందులో దళిత సామాజిక వర్గాలు ముందు వరుసలో ఉన్నాయి. మతం ఆధారంగా నిలిచినా లేకపోతే కులం ఆధారంగా నిలిచినా జగన్ కు అండగా నిలిచారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఆ సామాజిక వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే విధంగా జగన్ తన వంతు సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం తరఫున కొన్ని కీలక కార్యక్రమాలను కూడా జగన్ చేపట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు.

రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని అంశాలను టార్గెట్ గా చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో విదేశాలకు వెళ్లి చదువుకునేవారు విషయంలో చంద్రబాబు నాయుడు సర్కార్ చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది. ఇప్పుడు వైయస్ జగన్ సర్కార్ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొంత మంది కోరుతున్నారు. చాలామంది విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే కోరిక ఉన్నా సరే ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెనకడుగు వేస్తున్నారు. ఉన్నత విద్యనభ్యసించే ఆసక్తి ఉన్న ఆ స్థోమత కాస్తో కూస్తో ఉన్నా... ప్రభుత్వ ప్రోత్సాహం లేక వెనకడుగు వేసే పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: