ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాగా చదువుకుని మంచి స్థాయిలో జీవించాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇంటర్ మీడియట్ లేదా డిగ్రీ వరకు మన దేశంలోనే చదువుకుంటారు. అయితే ఆ తర్వాత పెద్ద పెద్ద చదువులు చదవడానికి విదేశాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే వీరంతా విదేశాలకు ఎందుకు వెళుతున్నారు. ఇండియాలో మంచి యునివర్సిటీ లు లేవనా ? మంచి నాణ్యత కలిగిన చదువులు దొరకవనా ? లేక ఇంకేదైనా సమస్య ఉందా. అయితే ఇవన్నీ ఒక డిగ్రీ చదివిన స్టూడెంట్ గా ఆలోచించగలిగే సామర్థ్యం వారికి ఉంటుంది. కానీ తల్లితండ్రుల ఒత్తిడి దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఎందుకంటే వారి బంధువుల్లో ఎవరో ఫారిన్ లో చదివి ఉంటాడు. అందుకే వీరు కూడా తమ బిడ్డను వారికి ఇష్టమున్నా లేకపోయినా ఫారిన్ లో చదివించాలని చూస్తారు. పిల్లలు కూడా వారు మాటను కాదనలేక అయిష్టంగానే వెళ్తారు. వీరు అంతా కూడా ఎక్కువగా అమెరికాకు పంపిస్తారు. అక్కడ అయితేనే మంచి ఎడ్యుకేషన్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ దొరుకుతాయని వారి నమ్మకం. ఒకే వెళ్లారు. మూడు లేదా నాలుగు సంవత్సరాల పాటు వారి చదువు పూర్తి చేస్తారు. తర్వాత ఇండియాకి తిరిగి రావాలిగా, కానీ రారు. అక్కడే ఉద్యోగం చేయడానికి నిర్ణయించుకుంటారు. ఈ విషయంలో భారతీయులలో చాలా మంది అసహనం గా ఉన్నారు.

మన దేశంలో పుట్టి, ఇక్కడే పెరిగి సర్వ హక్కులు ఇక్కడే పొంది అక్కడే ఉద్యోగాలు చేయడం ద్వారా మన సేవలను వారి అభివృద్ధికి ఉపయోగిస్తున్నారు. అయితే ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోవలసిన అవసరం ఉంది. మన మేధస్సు తెలివి అంతా కూడా మన దేశ అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడాలి అనే విషయాన్నీ నేటి విద్యార్థులు అందరూ గుర్తించుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: