దీంతో ఎంతో మంది ప్రజలు ప్రస్తుతం వరదల కారణంగా అల్లాడిపోతున్నారు. అదే సమయంలో ఇక వరదలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన దుస్థితి కూడా ఏర్పడింది. ఇలాంటి సమయంలోనే అధికారులు ప్రస్తుతం సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే ఇలా ఇండియా మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలం అవుతుంటే బ్రిటన్లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయ్ అన్నది తెలుస్తుంది. భానుడి ఉగ్రరూపంతో బ్రిటన్ ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్నారు. ఇక్కడ అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే భారత్లో భారీ వర్షాల నేపథ్యంలో భయపడి ప్రజలెవరూ ఇంటి నుంచి కాలు బయట పెట్టడం లేదు. ఇక బ్రిటన్లో ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు ఎవరూ కూడా బయటకు రావాలంటేనే జంకుతున్నారు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే దేశం మొత్తం నేషనల్ హీట్ వేవ్ ఎమర్జెన్సీ విధించాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ఎమర్జెన్సీ అమలులోకి తీసుకు వస్తే స్కూళ్లు కాలేజీలు న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు పర్యాటక ప్రాంతాలు అన్ని మూత పడతాయి అని చెప్పాలి. ఈ విషయం తెలిసిన ఇండియన్స్ అబ్బా ఆ ఎండ ఏదో మా దగ్గర ఉంటే ఎంత బాగుండు అని కోరుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి