
ఇలా దైవ దూసిన చేసిన వారికి న్యాయస్థానాలు మాత్రం సరైన శిక్ష వేయడం లేదు ఇండియాలో అని చెప్పాలి. కానీ పాకిస్తాన్ లో మాత్రం ఇటీవల దైవ దూషణ చేసినందుకుగాను ఒక వ్యక్తికి ఆ దేశ కోర్టు విధించిన శిక్ష కాస్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. దేవునిపై అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు దూషణకు పాల్పడ్డాడు అనే ఆరోపణలతో ఒక క్రైస్తవ యువకుడికి పాకిస్తాన్ కోర్టు మరణ శిక్ష విధిస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
ఈ ఘటన పాకిస్తాన్లోని లాహోర్లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. లాహోర్ కు 400 కిలోమీటర్ల దూరంలోని బహావల్ పూర్ లో ఇస్లాం కాలనీకు చెందిన 19 ఏళ్ల నౌమన్ మసేహ అనే యువకుడు దైవాన్ని దూషిస్తూ ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు కొన్ని కామెంట్లు కూడా చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అతనిపై కేసు నమోదు చేశారు అక్కడి అధికారులు.. ఇక వాట్సాప్ ద్వారా అతడు పంపించిన మెసేజ్లను వీడియోలను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టారు . ఇక ఇదే విషయంపై విచారణ జరిపిన బహవల్పూర్ న్యాయస్థానం నిందితుడి పై మోపిన ఆరోపణలు రుజువు కావడంతో మరణశిక్షతోపాటు 20000 జరిమానా విధిస్తూ తీర్పును ఇచ్చింది.