సొంత కుటుంబీకుల విషయంలో కాస్తయినా జాలీ దయ చూపించకుండా దారుణంగా ప్రాణాలను గాల్లో కలిపేస్తున్నారు ఎంతోమంది. ఇలాంటి ఘటనలు చూశాక సభ్య సమాజంలో బ్రతుకుతుంది మనుషులా లేకపోతే మనుషుల రూపంలో ఉన్న మానవ మృగాల అన్నది కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో ఎప్పుడు ఎవరి నుంచి ప్రాణహాని ఉందో అని భయంతోనే ప్రతి క్షణాన్ని గడుపుతున్నాడు మనిషి. ఇక ఇటీవల అమెరికాలో అయితే అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. కట్టుకున్న భార్యకు కష్టసుఖాల్లో తోడుండాల్సిన భర్త క్రూరత్వానికి తెగబడ్డాడు.
భార్యను చంపి బ్రెయిన్ తిన్నాడు. మెక్సికోలో 32 ఏళ్ళ అల్వారో తన భార్య మారియా ను దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె బ్రెయిన్ తిన్నాడు ఈ రాక్షసుడు. అంతేకాదు భార్య పుర్రెను యాష్ ట్రేగా కూడా ఉపయోగించాడు. ఇక ఆమె శరీర భాగాలను ముక్కలు చేసి కవర్లో ప్యాక్ చేసాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని తన కూతురికి చెప్పాడు. అయితే కూతురు ఒకసారిగా భయపడిపోయి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే దయ్యమే తనతో ఇలా చేయించిందని.. అల్వారో పోలీసుల విచారణలో తెలిపాడు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి